నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గాంధీనే బరిలో దింపడం పట్ల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి సర్ధార్ సర్వాయి పాపన్న చిత్రపటాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలోని గౌడుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, కే.శ్రీనివాస్ గౌడ్, దుర్గం వీరేశం గౌడ్, జీ.మోహన్ గౌడ్, సి.యాదగిరి గౌడ్, ఓం ప్రకాష్ గౌడ్, బాలింగ్ యాదగిరి గౌడ్, కొమరగౌని సురేష్ గౌడ్, పుట్ట వినయకుమార్ గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, నిమ్మల ధాత్రినాథ్ గౌడ్, రాచమళ్ల శ్రీనివాస్ గౌడ్, దొంతి కార్తీక్ గౌడ్, కంజర్ల శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.