నమస్తే శేరిలింగంపల్లి: బిసిల సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని బి.ఆర్.ఎస్. సీనియర్ యవ నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్ అన్నారు. అయితే తనకు బిసి బంధు వచ్చేలా కృషి చేసిన కార్తిక్ గౌడ్ ను చందానగర్ కు చెందిన గుండోజు శ్రీనివాస్ చారి సన్మానించారు.
బి.సి. స్కీమ్ గురించి తెలియజేసి, ఆన్లైన్ లో దరఖాస్తు చేయించారని, అంతేకాక శుక్రవారం బిసి బంధు చెక్కు కూడా అందుకున్నానని తెలిపారు. ఈ సందర్బంగా చందానగర్ డివిజన్ అద్యక్షుడు రఘునాధ్ రెడ్డి, చందానగర్ డివిజన్ బి.ఆర్.ఎస్. సీనియర్ యవ నాయకులు దొంతి కార్తీక్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.