బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని శేరిలింగంపల్లి మియాపూర్ బీసీల ఐక్యవేదిక మొదటి సమావేశం సమావేశంలో అన్ని పార్టీలను డిమాండ్ చేశారు శేరిలింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం నాయకులు. కమిటీ సభ్యులంతా కలిసి తాత్కాలిక కన్వీనర్ గా బేరి రామచందర్ యాదవ్ ను నియమించారు.
ఏ పార్టీ అయినా బీసీలకు టికెట్లు ఇస్తే వాళ్లకే బీసీ ఐక్యవేదిక మద్దతు తెలుపుతుందని, బీసీలకు రాజ్యాధికారం కావాలని, బీసీల ఐక్యంగా ముందు నడిస్తే బీసీ లకు రాజ్యాధికారం వస్తుందని సమావేశంలో వక్తలు మాట్లాడారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు శేరిలింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్, సాయన్న బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు , శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, మియాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు పసునూటి సరోజమ్మ, డివిజన్ జనరల్ సెక్రెటరీ వెంకటలక్ష్మి, అందెల కుమార్ యాదవ్, హైదరాబాద్ యూనివర్సిటీ బీసీ స్టూడెంట్ అధ్యక్షుడు శ్రీరామ్ యాదవ్, మైనార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు.