- జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ని కలిసిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న డ్రైనేజి సమస్యల పరిష్కారానికి నిధులను మంజూరి చేయాలనీ ప్రభుత్వ విప్ గాంధీ కోరారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ని కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పరిష్కరించాల్సిన పలు సమస్యలపై , చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై చర్చించారు.
పెరుగుతున్న జనవాసలకు అనుగుణంగా కాలనీ వాసుల దాహార్తి ని తీర్చడానికి, మిగిలిపోయిన అసంపూర్తి మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం కోసం నిధులు మంజూరి చేయాలని, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని తెలిపారు. దీనికి జలమండలి ఎండీ దాన కిషోర్ సానుకూలంగా స్పందిస్తూ అదనపు మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం కు నిధులు మంజూరు చేస్తామని, అదనపు మంచి నీటిని విడుదల చేస్తామని, సీవరేజ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, దశల వారీగా నిధులను సమకూరుస్తానని తెలిపారు.