నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో, రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు జరగక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ఉద్యోగ భృతి కల్పించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు డిమాండ్ చేశారు. జెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన అఖిలభారత యువజన సమైక్య (ఏఐవైఎఫ్) శేరిలింగంపల్లి నిర్మాణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదన్నారు. ప్రభుత్వ సెక్టర్లను ప్రైవేటు పరం చేసి ఉన్న ఉద్యోగాలనే తీసేసినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువతకు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న తెలంగాణ ప్రభుత్వం.. మాటను మరిచిందని, తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ జారీలు చేసి ఉద్యోగ కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. యువతరమా మేలుకో.. మగత నిద్ర మానుకో.. నవతరమా మేలుకో సమరానికి సాగిపో.. అంటూ సిపిఐ శేరిలింగంపల్లి కార్యదర్శి టి రామకృష్ణ పిలుపునిచ్చారు. రెండు ప్రభుత్వ పార్టీలకు బుద్ధి చెప్పాలని, గద్దె దించాలని యువకులకు ఆదేశించాడు. కార్యక్రమంలో ఏఐటిసి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె చందు యాదవ్, ఇజ్జత్ నగర్ కార్యదర్శి కే ఖాసీం, ప్రజానాట్యమండలికి సుధాకర్. కే లక్ష్మమ్మ మహిళా సమైక్య. టి కృష్ణ. రాములు యాదవ్ గోపాల్ రెడ్డి నగర్ కార్యదర్శి పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గా విష్ణు, కార్యదర్శిగా జెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షుదిగా లక్ష్మి బాలకృష్ణ , కిషోర్, సహాయ కార్యదర్శులు కృష్ణయ్య, స్రవంతి, ఉమా, వీరలతో కంపెనీ ఏర్పాటు జరిగింది.