- సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కార్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరోసారి కృతజ్ఞతల వెల్లువ వాన జల్లులా కురుస్తున్నది. రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ధ్యనవాదాలు తెలిపారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో పాటు, నిన్న తీసుకున్న రైతు రుణమాఫీ, మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ, కాపు సంక్షేమ సంఘం భవనం నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం కేటాయింపు, నోటరీ ఆస్తుల క్రమబద్దీకరణ నిర్ణయం, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసిన శుభసందర్భంగా అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద గౌడ్, బేతి సుభాష్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మనసున్న నేత అని, కర్షక, కార్మిక పక్షపాతి అని , రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలంతా సంబరాలు జరుపుకుంటున్నారని సీఎంకు తెలిపారు. వ్యవసాయ రైతు పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందనీ, రైతు బాంధవుడుగా సీఎం కేసీఆర్ మరోసారి నిలిచారని, రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరపున, తన తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.