మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ రోడ్ నంబర్ 42 – H లో పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని వారి విజ్ఞప్తి మేరకు కాలనీలో పర్యటించామని, కాలనీలో ఉన్న సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకుడు విద్యాసాగర్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు రాజు, జగన్మోహన్ రెడ్డి, రామరాజు, నర్సింహా రాజు, హరి కృష్ణ, రామచంద్రం, సుబ్బ రాజు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






