మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవి రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణన పారాయణలతో అమ్మవారికి తొమ్మిది చీరలను అలంకరించారు. అలాగే రైతులకు సుభిక్ష చేకూరాలని, రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుందని భావిస్తూ 25 మంది రైతులను సత్కరించారు. భక్తులంతా కలసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆశీస్సులను పొందారు.






