నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవార్లను దర్శించుకున్న ప్రభుత్వ విప్ గాంధీ

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ శనివారం నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల్లో కొనసాగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. తారానగర్ లోని శ్రీ తుల్జాభవాని ఆలయంలో మహిషాసురమర్దని, గంగారం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో దుర్గాదేవి, కొత్తగూడ శ్రీ వెంకటేశ్వర ఆలయం, మార్తాండ నగర్ లోని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తారా నగర్ తుల్జాభవాని ఆలయంలో మహిషాసురమర్దని అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున శర్మ, సభ్యులు

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా అటు కరోనా నుండి, ఇటు భారీ వర్షాల నుండి పూర్తిస్థాయిలో ఉపశమనం పొందాలని అమ్మవారిని వేడుకున్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కెసిఆర్ ప్రభుత్వం పదికాలాలపాటు ఇలాగే కొనసాగాలని అమ్మవారిని కోరుకున్నారు.

గంగారం హనుమాన్ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ, ఆలయ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం యాదవ్, వార్డు మెంబర్ దొంతి శేఖర్ ముదిరాజ్

ఈ కార్యక్రమాల్లో తారా నగర్ తుల్జా భవాని ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున శర్మ, సభ్యులు సంజీవరెడ్డి, రేణుక శ్రీనివాస్ గౌడ్, గోవింద చారి, సంపత్ గుప్త, రవీందర్, రాజు తివారి, గంగారం శ్రీ భక్తాంజనేయ ఆలయ కమిటీ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం యాదవ్, కమిటీ సభ్యులు శ్రవణ్ కుమార్, ఆర్ రవి కుమార్, నరసింహ, దినేష్, కొత్తగూడలో నాయకులు ఉట్ల కృష్ణ ట, జంగం గౌడ్, బాలకృష్ణ, దశరథ్, శశాంక్, నిర్మల, మార్తాండ నగర్ లో నాయకులు సాంభశివరావు ,శ్రీనివాస్ చౌదరి,రమేష్ ,రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడలో అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
మార్తాండ నగర్ లో స్థానిక నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here