- ప్రేమ్ నగర్ కాలనీలతో ముఖాముఖిలో బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్, ప్రేమ్ నగర్ కాలనీలో బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి రమేష్ పర్యటించారు. కాలనీ వాసులతో కలిసి ముఖాముఖి ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా బిఆర్ ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, కాలనీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రవి రెడ్డి, ఆరిఫ్, స్వామి, భగవాన్ దాస్, సయ్యద్, సంతోష్, సంగారెడ్డి, నర్సింగ్ రావు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.