పాలస్తీనాలో ఇజ్రాయిల్ మిలిటరీ దాడులను ఆపాలంటూ.. ఏఐపిఎస్ఓ నిరసన

  • తీవ్రంగా ఖండించిన (ఏఐపిఎస్ఓ) తెలంగాణ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్
  • ప్రజలంతా సమైక్యంగా ముందుకు వచ్చి పోరాడాలని పిలుపు
  • ఇజ్రాయిల్ తో భారతదేశం కుదుర్చుకున్న ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్

నమస్తే శేరిలింగంపల్లి: పాలస్తీనాలో ఇజ్రాయిల్ మిలిటరీ దాడులను ఆపాలంటూ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం(ఏఐపిఎస్ఓ) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొండాపూర్ లో నిరసన చేపట్టారు. పాలస్తీనాలోని జనినా శరణార్థుల శిబిరం, గాజాపై ఇజ్రాయిల్ మిలిటరీ దాడులను (ఏఐపిఎస్ఓ) తెలంగాణ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్ తీవ్రంగా ఖండించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ తో భారతదేశం కుదుర్చుకున్న ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని, పాలస్తీనాకు మద్దతుగా నిలబడాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో మొదటి, రెండవ, ప్రపంచ యుద్ధాల చేదు అనుభవాలను ఎవరు మర్చిపోలేదన్నారు. ఇజ్రాయిల్ పాలస్తీనాలోని శరణార్థుల శిబిరం జెనినా, గాజాల చేసిన దాడుల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలంతా సమైక్యంగా ముందుకు వచ్చి పోరాడాలన్నారు.

రంగారెడ్డి జిల్లా ఏఐపిఎస్ఓ అధ్యక్షుడు తిప్పర్తి మహేష్ మాట్లాడుతూ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం అంతర్జాతీయ జాతీయ స్థానిక సమస్యల మీద పోరాడుతుందన్నారు. యుద్ధాలు లేని సమాజం గురించి నిరంతరం కృషి చేస్తుందని, ఈ సంఘంలో అందరూ సభ్యులుగా చేరి ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలన్నారు. జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి పోలగాని రవి కిషోర్ మాట్లాడుతూ పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడి వల్ల, దాని ప్రభావం ప్రపంచమంతా ఉంటుందన్నారు. ఎక్కడ దాడి జరిగినా మనం దాన్ని ఎదిరించాలని, శాంతి కోసం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొర్రెల కేశప్ప కొంగర కృష్ణ, ఉపాధ్యక్షులు బిక్షపతి, రామకృష్ణ, లింగంగౌడ్, చందు యాదవ్, పరమేశ్వరి, శ్రీకాంత్, వెంకన్న, మల్లయ్య, రమేష్, డేవిడ్, జె. శ్రీనివాస్, ఎస్ కొండల్, కే సుధాకర్, బి. నారాయణ పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here