నాలుగేళ్లు పూర్తి చేసుకున్న తిరంగా యూత్‌

– మ‌దీన‌గుడ మ‌ద‌ర్ థెరిసా బ్ల‌డ్‌బ్యాంక్‌లో తిరంగా స‌భ్యుల ర‌క్త‌దానం
చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తిరంగా యూత్ ఆఫ్ ఇండియా వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని బుద‌వారం మ‌దీన‌గూడ మ‌ద‌ర్ థెరిసా బ్ల‌డ్ బ్యాంక్‌లో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. తిరంగా యూత్ ప్ర‌తినిధులు మంది ర‌క్త‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా యూత్ అధ్య‌క్షుడు రోష‌న్ శ‌ర్మ మాట్లాడుతూ తిరంగా యూత్ స్థాపించిన నాలుగేళ్లు గ‌డిచిన సంద‌ర్భం, అదేవిధంగా పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ర‌క్త‌దానం చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ర‌క్త‌దానం చేస్తున్న తిరంగా యూత్ అధ్య‌క్షుడు రోష‌న్ శ‌ర్మ‌

ఇదే స్పూర్తితో మున్ముందు మ‌రిన్ని సేవా కార్యాక్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు అన్ని విధాల స‌హ‌క‌రించిన పెద్ద‌ల‌కు, ప్ర‌తి సంద‌ర్భంలో త‌న‌కు అండ‌గా నిలిచిన యువ‌త‌కు ఆయ‌న ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స్వామి, ఉపాధ్య‌క్షులు సుధాక‌ర్‌, కార్య‌ద‌ర్శి ధ‌నుష్ గౌడ్, కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి రాకేష్ త‌లారి, స‌భ్యులు స‌మీర్‌, ముజ్జు, అక్ర‌మ్‌, అమిత్‌, షౌక‌త్‌, ఆమిన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరంగా యూత్ సభ్యులకు ప్రశంసా పత్రాలను అందజేస్తున్న మిరియాల ప్రీతం

తిరంగా యూత్ సభ్యులకు మిరియాల ప్రీతం ప్రశంసలు

టిఆర్ఎస్ యువజన నాయకులు మిరియాల ప్రీతమ్ తిరంగా యూత్ సభ్యులుకు ప్రశంసా పత్రాాాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడంపై వచ్చే అపోహలు నమ్మకుండా, ఆరోగ్యవంతులైన వారు రక్త దానం చేయడం వల్ల నిండు ప్రాణాలు కాపాడిన వారవుతారని అన్నారు. తిరంగా యూత్ సభ్యులు సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. 4 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరంగా యూత్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో దూసుకుపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ర‌క్త‌దానం చేస్తున్న తిరంగా యూత్ ప్ర‌తినిధి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here