ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శాతవాహన కాలనీ నుంచి జయనగర్ కాలనీ మీదుగా ఉషాముళ్ళపూడి రహదారిని కలిపే రోడ్డును కాలనీవాసులు నిర్మించుకున్నారు. భారీ వర్షాలకు రహదారి చిత్తడిగా మారి వాహనదారులు అవస్థలు పడుతుండడంతో కాలనీవాసులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సహకారంతో తాత్కాలిక రోడ్డును నిర్మించుకున్నారు. తాత్కాలిక రోడ్డు నిర్మాణానికి ఆర్థికంగా సహాయం చేసినందుకు గాను కాలనీవాసులు కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస మాజీ అధ్యక్షుడు పాండు గౌడ్, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్, సీనియర్ నాయకులు బోయ కిషన్ , మౌలానా, మున్నాభాయ్, నాయకులు వాసు, శ్రీనివాస్, యాదగిరి, కటికే రవి , ఎజాజ్, మురళి గౌడ్, జానయ్య పాల్గొన్నారు.