కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా ఇళ్ళు నీట మునిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్ హమీద్ పటేల్ బుధవారం అందజేశారు. సిద్దిక్ నగర్, అంజయ్య నగర్, ప్రేమ్ నగర్ ఎ బ్లాకులలోని పలువురు బాధితులకు ఆయన రూ.10వేల ఆర్ధిక సహాయాన్ని రెవిన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులతో కలసి అందజేశారు.


కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట అధికారులు డీఈ రమేష్, ఏఈ శ్రీనివాస్, డివిజన్ తెరాస అధ్యక్షుడు కృష్ణగౌడ్, వార్డు మెంబర్ రూపారెడ్డి, జంగం గౌడ్, వైస్ ప్రెసిడెంట్ గఫూర్, జనరల్ సెక్రటరీ పెరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం, ఏరియా కమిటీ మెంబర్స్ హిమామ్, మంగమ్మ, తిరుపతయ్య, విజయ్, తెరాస నాయకులు రవి గౌడ్, నందు, గణపతి, కుమార్, తిరుపతి, లావణ్య, సయ్యద్ ఉస్మాన్, యూత్ నాయకులు దీపక్, నసీరుద్దీన్, సత్యం గౌడ్, సత్తిబాబు, బస్తీ వాసులు ఉన్నారు.





