- మియాపూర్ రాఘవేంద్ర భవన్ ఉడిపి హోటల్లో ఘటన
- ఫిర్యాదులు చేసిన పట్టించుకోని జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్ స్పెక్టర్
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ పరిధిలోని పలు హోటళ్లు కుళ్లిపోయిన, నాణ్యతలేని ఆహార పదార్థాలను వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని, అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ప్రజల కోసం నాయకులు మిద్దెల మల్లారెడ్డి, తిరుమలేష్ మండిపడ్డారు. తాజాగా సోమవారం మియాపూర్ టాకి టౌన్ వద్ద రాఘవేంద్ర భవన్ ఉడిపి హోటల్లోకి తాము భోజనం చేసేందుకు వెళ్లామని, అక్కడ హోటల్ నిర్వాహకులు వడ్డించిన ఆహారపదార్థాలు కంపు కొట్టాయని, ముఖ్యంగా దోసకాయ చట్నీలో భరించరాని విధంగా దుర్వాసన వచ్చిందని తెలిపారు. దీనిపై హోటళ్ మేనేజర్ రమేష్ ను నిలదీయగా.. పట్టించుకోలేదన్నారు. దీంతో జిహెచ్ఎంసి అధికారి డాక్టర్ కార్తీక్ కి వాట్సాప్ లో ఫోటోలు పెట్టి ఫోన్ చేసి విషయం తెలిపితే ఏరియా ఫుడ్ ఇన్ స్పెక్టర్ హృదయకు చెప్పాలని తప్పించుకున్నాడని, ఏరియా ఫుడ్ ఇన్ స్పెక్టర్ హృదయకు కాల్ చేసిన, వాట్సాప్ లో ఫోటోలు పెట్టిన స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలంకరణలు చూసి హోటళ్లకు వెళ్లకుండా నాణ్యతను చూసి వెళ్లాలని ప్రజలకు సూచించారు.