శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం ఆయన శేరిలింగంపల్లి డివిజన్ గోపి నగర్ కి చెందిన ఎంకే విజయ లక్ష్మి అనే మహిళకు ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.3 లక్షల విలువ గల ఎల్వోసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తుందని తెలిపారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందే నిరుపేదలకు, అభాగ్యులకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసానిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, తెరాస నాయకులు బ్రిక్ శ్రీను, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.






