దీప్తిశ్రీనగర్‌ ఆల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దీప్తిశ్రీనగర్‌ ఆల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా డి.అశోక్‌ వర్మ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శిగా గురువా రెడ్డి, కోశాధికారిగా సి.పార్థసారధి, జాయింట్‌ సెక్రెటరీగా ఆనంద్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా బాబులాల్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా రామ్‌ స్టీల్‌ ప్యాలెస్‌, వీర్‌ పాల్‌, వెంకటేష్‌, తారాచంద్‌, బి.అరుణ, వెంకటరత్నం, డి.లక్ష్మారెడ్డి, కిశోర్‌ కుమార్‌, జితేందర్‌, ఎ.జయప్రకాష్‌ నారాయణన్‌, కె.రాఘవేందర్‌ రావులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ దీప్తిశ్రీ నగర్ వర్తక వ్యాపారుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, ఎలాంటి సమస్యలు ఎదురైనా అసోసియేషన్ సభ్యుల సహకారంతో సమిష్టిగా పోరాటం చేస్తామని అన్నారు.

నూత‌నంగా ఎన్నికైన దీప్తిశ్రీనగర్‌ ఆల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్ కార్య‌వ‌ర్గ స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here