శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు చేయబడిన రూ.10వేల ఆర్థిక సహాయాన్ని ఆయన మంగళవారం పలు కుటుంబాలకు అందజేశారు.

మియాపూర్ డివిజన్లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో వరదల వల్ల దెబ్బ తిన్న కుటుంబాలకి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ సుదాంష్ లతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశం, ఎస్ఐ మౌనిక, జీహెచ్ఎంసీ ఈఈ చిన్నారెడ్డి, మెడికల్ ఆఫీసర్ రవి కుమార్, డీఈ రూపా దేవి, ఏఈ రమేష్, డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, గంగాధర్, వరలక్ష్మి పాల్గొన్నారు.

హఫీజ్‌పేటలో…
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ లో పేద కుటుంబాలకి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ సుదాంష్, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశం, ఎస్ఐ మౌనిక, జిహెచ్ఎంసి ఈఈ చిన్నారెడ్డి, మెడికల్ ఆఫీసర్ రవి కుమార్, డీఈ రూపా దేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డివిజన్ తెరాస అధ్యక్షుడు బాలింగ్ గౌతం గౌడ్, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు సంజీవ రెడ్డి, సుధాకర్, ప్రవీణ్, నాయుడు, శ్రీనివాస్, పాల్గొన్నారు.

చందానగర్‌లో…
చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ లో వరదల వల్ల దెబ్బ తిన్న పేద కుటుంబాలకి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్ సుదాంష్, కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డిలతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, సునీత రెడ్డి, సీఐ వెంకటేశం, ఎస్ఐ మౌనిక, జిహెచ్ఎంసి ఈఈ చిన్నారెడ్డి, మెడికల్ ఆఫీసర్ రవి కుమార్, డీఈ రూపా దేవి, ఏఈ అనురాగ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, హఫీజ్‌పేట డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతం గౌడ్, తెరాస నాయకులు ఉరిటి వెంకట్రావు, అక్బర్ ఖాన్, ప్రవీణ్, ప్రభాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, గిరి పాల్గొన్నారు.





