శ్రీలలితా దేవిగా ద‌ర్శ‌న‌మిచ్చిన అన్నపూర్ణ అమ్మ‌వారు

చందానగర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్‌ డివిజన్‌ పరిధిలోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠపరిపాలిత శ్రీ షిర్డి సాయిబాబా దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం దేవాలయ ప్రాంగణంలోని అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారిని శ్రీలలితా దేవి అవతారంలో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని స్థానికులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

శ్రీలలితా దేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్న అన్నపూర్ణ అమ్మ‌వారు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here