చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు భక్తులకు అన్నపూర్ణా దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా అమ్మవారికి హోమం, కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం యాదవ్, కమిటీ సభ్యులు శ్రవణ్ కుమార్, కుమార్, ఆర్ రవి కుమార్, నరసింహ, దినేష్, ఆలయ పండితులు, భక్తులు పాల్గొన్నారు.







