- అంబేద్కర్ విగ్రహం దగ్గర కొవ్వొత్తులతో నిరసన
నమస్తే శేరిలింగంపల్లి: డాక్టర్ ధారావత్ ప్రీతి నాయక్ మరణంపై నడిగడ్డతండా లో అంబేద్కర్ విగ్రహం దగ్గర కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. డాక్టర్ ధారావత్ ప్రీతి నాయక్ మరణానికి కారణమైన ఎండి సైఫ్ ను కఠినంగా శిక్షించాలని, కళాశాల యాజమాన్యం హెచ్ ఓ డి ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, కాలేజీలలో ర్యాగింగ్ ను అరికట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏఐఎఫ్ డిడబ్ల్యు బి. విమల అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.
ఏఐఎఫ్ డిడబ్ల్యు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి అంగడి పుష్ప, ఏఐఎఫ్ డిడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, ఏఐఎఫ్ డివై యువతి విభాగం కన్వీనర్ సుల్తాన్ బేగం, ఏఐఎఫ్ డిడబ్ల్యు నాయకురాలు లలిత, శివాని, అనిత, తండా స్థానికులు గౌసియా బేగం, కైరునిషా బేగం, సునీత, సక్కుబాయి పాల్గొన్నారు.