శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. రైలు విహార్ ఫేజ్ 1 కాలనీలో మంగళవారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. కాలనీకి ఆనుకుని ఉన్న నాలా ద్వారా కాలనీలోకి వర్షపు నీరు వస్తుందని స్థానికులు ఫిర్యాదు చేయగా మాన్ సూన్ టీం తో జేసీబీ సహాయంతో అప్పటికప్పుడు నాలాలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, చెత్తాచెదారాన్ని తొలగింపజేశారు.

ఇటీవల కురిసిన వర్షం నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరిందని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితులు కోరగా తప్పకుండా నష్టపరిహారం ఇప్పించేలా చూస్తామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హామీనిచ్చారు. అనంతరం లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీటిని మోటర్ల సహాయంతో తొలగింపజేశారు. దీంతో వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూశారు. ఆయన వెంట వర్క్ ఇన్ స్పెక్టర్ యాదగిరి, రైలు విహార్ కాలనీ వాసులు కెవి బాబురావు, ఈశ్వర్ రావు, ముత్తుస్వామి, శుక్లాసంజీవ్, ఈశ్వరమ్మ, భాను, నవీన్, శ్రీనివాస్, బలరాం, అలీనవాజ్, అజ్జు, నాగిణి, అరుణ, గాయత్రి, ఈశ్వరమ్మ, ధనలక్ష్మి తదితరులు ఉన్నారు.






