హామీలు నెరవేర్చడంలో బి ఆర్ ఎస్ విఫలం

నమస్తే శేరిలింగంపల్లి: నానక్‌రామ్‌గూడ లో ప్రజా గోస – బిజెపి భరోసా శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. నానక్‌రామ్‌గూడలో 16, 17, 18, 19 బూత్ ల శక్తి కేంద్ర ఇంఛార్జిలు మీన్ లాల్ సింగ్, సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హాజరై, పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రజా గోస – బిజెపి భరోసా శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

రాష్ట్రంలో రాక్షస కుటుంబ పాలన నడుస్తుందని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బి ఆర్ ఎస్ పార్టీ విఫలమైందని, 2014 ముందు 60 వేల కోట్ల అప్పులు ఉన్న తెలంగాణ ఈ రోజు 5 లక్షల కోట్ల అప్పుకు చేరిందని, ఎలక్షన్స్ కు ముందు ఇచ్చిన హామీలు దళిత బంధు, గిరిజన బంధు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, రైతుబంధు, రైతు రుణమాఫీ, ఇలా ఎన్నో స్కీములు పెట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పంచడంలో విఫలమైందని తెలిపారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇక్కడ కూడా సుపరిపాలన జరుగుతుందని, దానికి సంబంధించి ప్రజలందరూ రాష్ట్రంలో కూడా బిజెపి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు (ఆయుష్మాన్ భారత్, ముద్ర యోజన, సుకన్య సమృద్ధి యోజన) సద్వినియోగం చేసుకోవాలని, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లాలని బీజేపి నాయకులకు పిలుపిచ్చారు.

ప్రజా గోస – బిజెపి భరోసా శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ రావు, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు శివ సింగ్, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, సంతోష్ సింగ్, శ్రీకాంత్ రెడ్డి, దేవరకొండ గోపాల్, బాబులు సింగ్, జితేందర్ సింగ్, అరవింద్ సింగ్, నానక్‌రామ్‌గూడ కాలనీ వాసులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here