- ప్రత్యేక పూజలు చేసిన మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ శివాలయంలో భువనేశ్వరి సమేత రామలింగేశ్వర ఆలయం వద్ద రాజగోపురం ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని పూజలు చేశారు. అదేవిధంగా డివిజన్ పరిధిలోని అనేక శివాలయాల్లోనూ శైవక్షేత్రాల్లో భక్తులతో కలిసి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శనివారం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారని, శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయని, ఆలయాల వద్ద అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు నిర్వాహకలు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయాల వద్ద ఉదయం నుంచి బిల్వార్చనలు, విశేష అభిషేకాలు, పలు సాపో కార్యక్రమాలు, వేద మంత్రాల మధ్య విశేష పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, కృష్ణ గౌడ్, ఒరుగంటి బాలేష్, బ్రహ్మయ్య యాదవ్, శ్యామ్, వార్డ్ సభ్యులు రామచందర్, తైలి కృష్ణ, లోకేష్, బాలరాజు యాదవ్, మహీందర్, సత్తి రెడ్డి, కృష్ణ ముదిరాజ్, తిరుపతయ్య, రవి, మహేష్, సుధాకర్ ముదిరాజ్, రాములు, రమేష్, అచ్యుత్ రావు, శ్రీను నాయక్ పాల్గొన్నారు.