- ఆద్యంతం ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో శివరాత్రి పండుగ పురస్కరించుకొని “వందేహం శివోహం” కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. డాక్టర్ వినీల రావు శిష్య బృందం ప్రదర్శించిన అంశాలు ప్రణవాకారం, భో శంభో, శివ పాద మంజీరం, ఆనంద తాండవం, శివాష్టకం, శంకర శ్రీగిరి, కంజదళయాదాక్షి, జయ లక్ష్మి, శివ తాండవం, కృష్ణ శబ్దం మొదలైన అంశాలను చక్కగా ప్రదర్శించారు. సినీ ప్రొడ్యూసర్ తుమ్మలపళ్లు రామ సత్యనారాయణ, సెక్రటరీ సిద్ధార్థ స్పోర్ట్స్ ఆడిటోరియం విజయ్ కుమార్ , విశ్రాంత రిజిస్టారర్ గౌరీ శంకర్, YSR మూర్తి, చైర్మన్ YSR మూర్తి చారిటబుల్ ట్రస్ట్, శరత్ చంద్ర సినీ రైటర్ ముఖ్య అతిధులుగా విచ్చేసి కళాకారులను ఆశీర్వదించారు.