అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్ రూం ఇవ్వాలి : సిఐటియు

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సలీమ్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ కె. కృష్ణ మాట్లాడుతూ.. మండల పరిధిలో స్వంత ఇల్లు లేక అనేక మంది పేదలు అద్దె ఇండ్లల్లో ఉంటూ జీవనాన్నీ కొనసాగిస్తున్నారని, ఇల్లు లేని పేదలందిరికి డబల్ బెడ్ రూం కట్టించి ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రలోభాలు పలికిందని దుయ్యబట్టారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఇస్తామని చెప్పి తుంగలో తొక్కిందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్ రూం ఇవ్వాలని ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోపన్ పల్లి పరిధిలో 36 సర్వే నెంబర్ లో100 ల ఎకరాల ప్రభుత్వ భూమిని భూ కబ్జా దారులు కబ్జా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారని, ఆ భూములను కబ్జాదారుల నుంచి కాపాడి పేదలందరికి డబల్ బెడ్ రూం కట్టించి ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో sfi రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బి.శంకర్ సిఐటియు నాయకులు సెవ్యా పాల్గొన్నారు.

తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సలీమ్ కి వినతి పత్రం శేరిలింగంపల్లి సిఐటియు మండల కమిటీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here