- ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడలోని అలర్మెల్ మంగా పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి, భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయాంజనేయ వార్ల దేవస్థానం సముదాయంలో జరిగిన వెంకటేశ్వర స్వామి 18వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకగా జరిగింది. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దేవాలయం చైర్మన్ ఊట్ల కృష్ణ, వైస్ చైర్మన్ గంగుల నర్సింహ యాదవ్, జనరల్ సెక్రటరీ ఉట్ల దశరథ్, లక్ష్మణ్, రమేష్, నిర్మల పాల్గొన్నారు.