గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్ కాలనీలో కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పర్యటించారు. వర్ష ప్రభావం నెలకొన్న డ్రైనేజీ సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత్ హిల్స్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్య పై ఎస్ఆర్పీ కిష్టయ్యతో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కారానికి కార్పొరేటర్ కృషి చేశారు. ఆయన వెంట వార్డు మెంబర్ అంజమ్మ, ఏరియా కమిటీ మెంబర్ రాజు ముదిరాజ్, నాయకులు రమేష్ గౌడ్, గోవింద్, కాలనీవాసులు ప్రసాద్, వరుణ్ రెడ్డి, సతీష్ రెడ్డి, రవి కిరణ్ తదితరులు ఉన్నారు.







