నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సన్మానించి, అభినదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ నగర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తాను కృషి చేస్తానని చెప్పారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సుభాష్ చంద్రబోస్ నగర్ ముఖ్య సలహాదారుడు సాంబశివరావు , ప్రెసిడెంట్ అంకారవు, అడ్వైజర్లు బృందరవు, భుజంగం ,రాములు యాదవ్, సత్యనారాయణ గుప్తా, ప్రధాన కార్యదర్శి నర్సింహ రావు, ఉపధ్యక్షుడు సాబేర్, జాయింట్ సెక్రటరీ ముక్తార్, మోహిసిన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింహ, ట్రెజరర్ కృష్ణం రాజు, మెంబెర్లు రమణయ్య, రవి, వీర రాఘవయ్య పాల్గొన్నారు.