నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను సెంట్రల్ కేంద్ర రైల్వే, టెక్స్ట్ టైల్స్ శాఖ మంత్రి దర్శన విక్రమ్ జర్దోష్ సందర్శించారు. అక్కడ కొలువుదీరిన చేనేత హస్తకళా ప్రదర్శనని తిలకించారు. ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి చేనేత హస్తకళా కారులతో మాట్లాడి వారి నైపుణ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర మంత్రి శిల్పారామానికి విచ్చేసిన సందర్బంగా శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు ఐఏఎస్, జనరల్ మేనేజర్ అంజయ్య, మేళ నిర్వాహకులు అరుణ్ కుమార్ స్వాగతం పలికారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి కళాకారులను సన్మానించారు. ఇలాంటి మేళాలను భారతదేశంలో వివిధ ప్రాంతంలో ఏర్పాటు చేసి చేనేత హస్తకళాకారులకి తమ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కోలకతా నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారులు సుతప అవన్ ప్రాధాన్ బృందం చేసిన భరతనాట్యం , పూనమ్ బృందం చేసిన కతకే నృత్య ప్రదర్శన, తులసి ఆంధ్ర నాట్యం లో భామాకలాపం నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి.