ప్రభుత్వ పథకాలే ప్రభాకర్ రెడ్డికి రక్ష: కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో, మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలంలోని పలు గ్రామాలలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఇంటింటికి తిరిగి, ఓటర్లను కలసి, కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్ధించారు. ఈ సందర్బంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఏకమై బీజేపీ కుట్ర రాజకీయాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మార్పు నేటి మన మునుగోడు నుండే మొదలవుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందిన తీరును ప్రజలు ముందుకు వచ్చి చెబుతున్నారని తెలిపారు. తెరాస ప్రభుత్వ హయాంలో ప్రతి పథకం పేదల దారికి చేరిందని, లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులకు ప్రజలు, యువత పెద్ద ఎత్తున ఆకర్షితులై, మునుగోడు గెలిపించే బాధ్యత మాది అని అంటున్నారని అన్నారు. అభిమానులు, ప్రజలు టీఆరెస్ పార్టీ పేరు పచ్చబొట్టు వేయించుకోవటం సీఎం కేసీఆర్ పని తీరుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణగౌడ్, తెరాస నాయకులు తిరుపతి యాదవ్, కచ్చావా దీపక్, వెంకటయ్య సాగర్, దేవేందర్, ప్రసాద్ సాగర్, గణేష్, అంజయ్య, కొలువురి కృష్ణయ్య, ఉంగరాల నారాయణ, ఉంగరాల వేమయ్య, ఉంగరాల వాసు, పి. యాదయ్య పాల్గొన్నారు.

చండూర్ మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here