బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనకు అమెరికన్ ఆంకాలజీ పింక్ రిబ్బన్ కలెక్షన్ ఆవిష్కరణ

  • ప్రతి స్త్రీ తానే స్వయంగా వ్యాధిని తొలిదశలోనే గుర్తించవచ్చు: అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్
  • ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలి: కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి
  • స్త్రీలలో లోతైన అవగాహనను పెంపొందించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం: ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత

నమస్తే శేరిలింగంపల్లి: బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా పింక్ రిబ్బన్ కలెక్షన్ ను అమెరికన్ ఆంకాలజీ ఇని స్టిట్యూట్ ఆవిష్కరించింది. ‘బ్రెస్ట్ కాన్సర్ పుష్ అవే బ్రా’ లిమిటెడ్ ఎడిషన్ ను ప్రారంభించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అక్టోబర్ లో నిర్వహించే బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసానికి మద్దతుగా అమెరికన్ ఆంకాలజీ ఇని స్టిట్యూట్ నిర్వహించిన కార్యక్రమాన్ని కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రతి స్త్రీ.. తనకు బ్రెస్ట్ కాన్సర్ ఉందో .. లేదో తానే స్వయంగా పరీక్షించుకునేలా .. తొలి దశలోనే దాని సంకేతాలను గుర్తించేలా ఈ కలెక్షన్ ఓ వ్యక్తిగత రిమైండర్ లా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి అవగాహన సదస్సులు మరిన్ని ఏర్పాటు చేసి మహిళల్లో అవగాహన పెంచాలని సూచించారు. ముందస్తుగా చర్యలు తీసుకుంటే రోగాలను మొదటిలోనే అరికట్టవచని అన్నారు.

పింక్ రిబ్బన్ కలెక్షన్ ఆవిష్కరణలో కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత

ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత మాట్లాడుతూ స్త్రీ వక్షోజ ఆరోగ్యానికి.. 6 అంచెల ‘బ్రెస్ట్ క్యాన్సర్ పుష్ అవే బ్రా’ లిమిటెడ్ ఎడిషన్ అండగా నిలుస్తుందని, అర్ధం లేని సంకోచాలను పక్కన పెట్టి బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అమెరికన్ ఆంకాలజీ ఇని స్టిట్యూట్ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి స్త్రీ సంభాషణలోనూ బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల వారికున్న అవగాహన ప్రతిధ్వనిస్తుందనారు. స్త్రీలలో లోతైన అవగాహనను పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహనను పెంపొందించేందుకు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

పింక్ రిబ్బన్కకలెక్షన్ గురించి వివరిస్తున్న అమెరికన్ ఆంకాలజీ సిబ్బంది

రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రభాకర్ మాట్లాడుతూ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ ని తొలి దశలోనే గుర్తించేందుకు అవసరమైన అవగాహనను ఈ పింక్ రిబ్బన్ కలెక్షన్ పెంపొందిస్తుందని అన్నారు. ప్రతి స్త్రీ క్రమం తప్పకుండా తన వక్షోజాలను స్వయంగా పరీక్షించుకుంటూ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. తగు చికిత్స పొంది, ఈ వ్యాధి నుంచి తమను తాము సంరక్షించుకోవాలన్నదే అమెరికన్ ఆంకాలజీ ఇని స్టిట్యూట్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. దక్షిణ ఆసియాలోని తమ పేషెంట్లకు అత్యున్నత స్థాయి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యుత్తమ చికిత్సనందించేందుకు నిరంతరం నిబద్ధతతో వ్యవహరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

పింక్ రిబ్బన్ ప్రచార బోర్డుపై చేత్తో ముద్ర వేస్తున్న చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

భారత దేశంలో అత్యంత తరచుగా వచ్చే క్యాన్సర్లలో.. బ్రెస్ట్ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలను వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఇది ఒకటి. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి, త్వరితగతిన చికిత్సను అందించడమే వ్యాధిని నియంత్రణలో ఉంచేందుకు సరైన మార్గమని వరల్డ్ క్యాన్సర్ రిపోర్ట్ 2020 పేర్కొంది. 40 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ.. ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజా అలీ ఖాన్, మార్కెటింగ్ సీనియర్ జనరల్ మేనేజర్ గురు ప్రసాద్, ఉన్నతాధికారులు అంకిత, శ్రావణ్, నవీన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here