- కృషినగర్, బాలాజీ నగర్ కాలనీలలో సీసీ రోడ్ల పరిశీలనలో కార్పొరేటర్ ఉప్పలపాటి
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషినగర్, బాలాజీ నగర్ కాలనీలలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను స్ధానిక నాయకులు, కాలనీవాసులతో కలిసి పరిశీలించారు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి నగర్, బాలాజీ నగర్ కాలనీలలో సీసీ రోడ్ల పనులను పరిశీలించామని, పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత , సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు శాయ శక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఏ ఈ శివప్రసాద్ , వర్క్ ఇన్స్పెక్టర్లు
రఘు, నవీన్ , గుండె దయానంద్ ముదిరాజ్ , శ్రీధర్ ముదిరాజ్, సంతోష్ ముదిరాజ్, జంగం మల్లేష్, కాలనీ వాసులు, జానకి రామ్, మహేష్ పాల్గొన్నారు.