చందానగర్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎన్ క్లేవ్ చేపడుతున్న రోడ్డు పనులను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. దాదాపు యాభై లక్షల రూపాయలతో చేపట్టిన సిసిరోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిసి రోడ్డు నిర్మాణ పనుల్లో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌళిక వసతులు కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు టిఆర్ఎస్ నాయకులు దుర్గ, గీత, షేక్ హుస్సేన్ , వీరేషం, గోపాల్ రావు , నర్సింహ, సల్వరాజు, సుందరం, రామచందర్ రెడ్డి , హరీష్, అమిత్ , అవినాష్, దీక్షిత్, GHMC అధికారులు ఏఇ సంతోష్ రెడ్డి , వర్క్ ఇన్స్పెక్టర్ సురేందర్, కృష్ణ, పాల్గొన్నారు.

సురక్ష ఎన్ క్లేవ్ వద్ద వద్ద చేపడుతున్న రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here