- మియాపూర్ డివిజన్ లో రూ. 2 కోట్ల 97 లక్షల 20 వేలతో అభివృద్ది పనులు
- కార్పొరేటర్ ఉప్పలపాటి తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ లో అభివృద్ది పనులకు రూ. 2 కోట్ల 97 లక్షల 20 వేల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ, పార్క్ ప్రహరీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివృద్ది ఆగకూడదనే ఉద్దేశ్యంతో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో.. మంత్రి KTR సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ, పార్క్ ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కోసం శాయశక్తుల కృషి చేస్తానని, పార్క్ లను అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని తెలిపారు. మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ పునరుద్ఘాటించారు.
- శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు.. మంజూరైన అభివృధి పనుల వివరాలు..
1.మియాపూర్ డివిజన్ పరిధిలోని BK ఎన్ క్లేవ్ లో రూ. 150 లక్షల అంచనావ్యయంతో వరద నీటి కాల్వ నిర్మాణ పనులు
2.మియాపూర్ డివిజన్ పరిధిలోని KK ఎన్ క్లేవ్ కాలనీ లో రూ. 40 లక్షల అంచనావ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు
3. మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ లో రూ.67.20 లక్షల అంచనావ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు
4. మియాపూర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ రెడ్డి కాలనీ లో రూ.40.00 లక్షల అంచనావ్యయం తో చేపట్టబోయే పార్క్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు , కాలనీ వాసులు పాల్గొన్నారు.