నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ లో దేవి నవరాత్రుల సంధర్భంగా జరిగిన అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు వెంకటేష్ గౌడ్ , చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు అక్బర్ ఖాన్, బబ్లు, నరేందర్ బల్లా పాల్గొన్నారు.