నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి సర్కిల్ మరియు చందానగర్ సర్కిల్ పరిధిలోని పలు డివిజన్ల లో పారిశుధ్య పనుల నిర్వహణ పై GHMC శానిటేషన్ విభాగం అధికారులు, రాంకీ సంస్థ ప్రతినిధులతో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ పారిశుధ్య పనుల నిర్వహణ అలక్ష్యం పై GHMC శానిటేషన్ విభాగం అధికారులు, రాంకీ సంస్థ ప్రతినిధుల తో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. పారిశుధ్య పనుల నిర్వహణ పై అలసత్వం ప్రదర్శించకూడదని, అలసత్వం ప్రదర్శిస్తే సహించే ప్రసక్తే లేదని అధికారులకు హెచ్చరించారు. రాంకీ సిబ్బంది , GHMC అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల కాలనీ లలో చెత్తకుప్పల తొలగింపు ;పక్కన పడిందని తీవ్ర అసంతృప్తి ని వెలిబుచ్చారు. రాంకీ సంస్థ ఉద్యోగులకు అనుభవము లేకపోవడం, సరైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోవడం పై GHMC అడిషనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలన్నారు. GHMC శానిటేషన్ సిబ్బంది, రాంకీ సంస్థ ఉద్యోగులు సమన్వయంతో పని చేసి ప్రతి కాలనీ ని స్వచ్ఛ కాలనీ గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కాలనీలలో, బస్తీ లలో , ప్రధాన రహదారుల పై చెత్తకుప్పలు పేరుకపోవడంతో వర్షాల వలన డ్రైనేజి వ్యవస్థకు, నీటి ప్రవాహం సాఫీగా సాగకుండా వరదలకు కారణం అవుతుందని అన్నారు. పారిశుధ్య పనుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, AMOH ల పర్యవేక్షణ ఎల్లపుడు ఉండాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో AMOH నగేష్ నాయక్, కార్తిక్ , శానిటేషన్ సూపర్ వైజర్లు జలందర్ రెడ్డి, శ్రీనివాస్, SRP లు మహేష్, శ్రీనివాస్ రెడ్డి, కనకరాజు, ప్రసాద్, బాలాజీ, గంగిరెడ్డి, రాజయ్య, భరత్, కిరణ్, బాలరాజు, కృష్ణ, కిష్టప్ప, రాంకీ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.