నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా లండన్ నుండి విచ్చేసిన ప్రవాస భారతీయురాలు కుమారి సహన శ్రీధర్ ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. తన ప్రదర్శనలో గాయియే గణపతి భజన, సావేరి, జతిస్వరం, చలియే కుంజనామో పదం, ఇందేందు వచ్చితివిరా పదం, దేవి స్తుతి అంశాలను ప్రదర్శించారు. కర్ణాటక రాష్ట్రం తుంకూర్ నుంచి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి వాణి వెంకట్ రాము , నిర్మల నాట్య కళానికేతన్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన అలరించింది. మూషిక వాహన, గురు సమర్పణ, వాతాపి, సంకర శ్రీగిరి, బ్రహ్మ్మముక్కటేయ్ , ఓంకారకారిని, శివాష్టకం, జయ జనని శారదేయ్, మహాదేవ శివశంభో, నటేశ కౌతం, బ్రహ్మోస్తావా, మూకాంబికీ, నమో నమో భారతంబే, మంగళం అంశాలను దాదాపు ఇరవై మంది కళాకారులు తుంకూర్ నుండి విచ్చేసి ప్రదర్శించారు.







