నమస్తే శేరిలింగంపల్లి: 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆశ్రి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. మియాపూర్ మయూరి నగర్ లోని ఆశ్రి సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మియాపూర్ సీఐ తిరుపతి రావు, ఎస్ఐలు రవికిరణ్, రాఘవేంద్ర బహుమతులను, స్వీట్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ తిరుపతి రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆశ్రి సొసైటీ వారు విద్యార్థులకు ఇలాంటి పోటీలు నిర్వహించి బహుమతులను ప్రధానం చేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో అశ్రి సొసైటీ వ్యవస్థాపకులు పూర్ణిమాకిషోర్, పులిపల్పుల రాజేష్ గౌడ్ మక్త, రక్తపు శ్రావణ కుమార్ గౌడ్, కంజర్ల శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.