నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ సూచించారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి, మక్త మహబూబ్ పేట్, మియాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ ను మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ మళ్లీ తిరిగి రానిదని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా చదువుకోవాలని సూచించారు. ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మియాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు, కుర్చీల కొరత ఉందని ఉపాధ్యాయులు తెలపగా సానుకూలంగా స్పందించి సందయ్య మెమోరియల్ ట్రస్టు ద్వారా అందజేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి పటేల్, ఎల్లేష్, నాగులు గౌడ్, రాధా కృష్ణ యాదవ్, సమ్మెట ప్రసాద్, మాణిక్ గణేష్, వినోద్, శ్రీనివాస్ యాదవ్, శీను, పవన్, రాము, తదితరులు పాల్గొన్నారు.