నమస్తే శేరిలింగంపల్లి: దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ పథకం ద్వారా దళితుల కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక అసమానతలు రూపు మాపి వారి జీవితాలలో కొత్త వెలుగులు విరజిల్లుతూ సంతోషంగా ఉంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ విలేజ్ కి చెందిన శంకరమ్మకు, మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా కి చెందిన గోవింద్ కమలాకర్ కు మంజూరైన ఎరిటిగా కార్లను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ రావు, రోజాదేవి రంగారావుతో కలిసి లబ్దిదారులకు ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ దళిత బాంధవుడు అని, దళిత బంధు పథకంతో ద్విగుణీకృత మార్పు రావడం జరుగుతుందన్నారు. దళిత కుటుంబాల సంక్షేమానికి కట్టుబడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దళితబంధు లబ్ధిదారులు భవిష్యత్తులో మిగతా వారికి ఆదర్శంగా నిలిచేలా ఉండాలని, పక్క ప్రణాళిక తో యూనిట్లను నెలకొల్పి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. దళిత బంధు పథకం ద్వారా వాహనాలు పొందిన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, టీఆర్ఎస్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు,చంద్రారెడ్డి, బ్రిక్ శ్రీనివాస్,కాశినాథ్ యాదవ్, రఘునాథ్, స్వామి నాయక్, సుధాకర్, లక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు.