శ్రీరాంనగర్ లో పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీవాసుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని శ్రీరాంనగర్ కాలనీలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదుయాత్ర చేశారు. కాలనీ వాసులను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల సమస్యలపై తక్షణమే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట వెంటనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ దీపాల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అధికారులకు సూచించారు. కాలనీ అంతర్గత రహదారుల అభివృద్ధికి రానున్న వర్షాకాలంలో తీసుకోవాల్సిన పలు అంశాలపై సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే ఇప్పుడు సమస్యలు చాలావరకు తగ్గాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, గోపాల్ యాదవ్, శేఖర్, క్రాంతి, తిరుపతి, నాగరాజు, నాయుడు, చలపతి, రెడ్డి,కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాం నగర్ లో పర్యటించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here