నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష కాలనీలో నివసిస్తున్న ప్రభు కుమార్ ను చందానగర్ మాజీ కార్పొరేటర్, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవతా రెడ్డి పరామర్శించారు. ప్రభు భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతిచెందిన విషయం తెలుసుకున్న నవతా రెడ్డి ప్రభు కుమార్ స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభు కుమార్ కు, ఆయన కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యం కల్పించాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్లు తెలిపారు.