నమస్తే శేరిలింగంపల్లి: నియంతృత్వ, కుటుంబ పాలన, అవినీతి విముక్తి కోసం గడీల కుటుంబ పాలన నుంచి తెలంగాణను కాపాడేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తల పెట్టిన రెండో విఢత ప్రజా సంగ్రామ ముగింపు భారీ బహిరంగ సభలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగుడ వద్ద జనం గోస బిజెపి భరోసా పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు. భారీ బహిరంగ సభకు శేరిలింగంపల్లి అసెంబ్లీ శాఖ తరపున బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.