నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని ప్రజా సమస్యలపై, చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ఈ మేరకు జోనల్ పరిధిలోని జీహెచ్ఎంసీ, పోలీస్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఇరిగేషన్, ఎస్ఆర్ డీపీ, టీఎస్ఐఐసీ,
హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్‌బి, టీఎస్ఎస్ పీడీసీసీఎల్ తో పాటు వివిధ శాఖల అధికారులతో జోనల్ కార్యాలయంలో కన్వర్జెన్సీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ శంకరయ్య మాట్లాడుతూ శేరిలింగంపల్లి జోనల్ పరిధిలో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు సమిష్టిగా పనిచేయాలన్నారు.
ట్రాఫిక్ సమస్య లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభం కానున్న దృష్ట్యా నెలకొన్న సమస్యలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. డీసిల్టింగ్ పనులు, నాలాల రక్షణ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్లాంటేషన్ చేసేందుకు అన్ని శాఖల నుంచి స్థలాలు సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్, ఎస్ ఈ, ఆయా సర్కిళ్ల డీసీలు, ఏసీపీలు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ట్రాన్స్‌పోర్ట్, రెవెన్యూ, ఎలక్ట్రికల్, ఎంటమాలజీ, యూబీడీ, సీఆర్ఎంపీ, ఎస్ ఎన్ డీపీ, నీటి పారుదల, ఎస్ ఆర్ డీ పీ, హెచ్ ఆర్ డీ సీ ఎల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.