నమస్తే శేరిలింగంపల్లి: భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీ లో హెచ్ ఎం డబ్ల్యుఎస్ అండ్ ఎస్ బీ ఆధ్వర్యంలో 16.5 కిలోమీటర్ల మేర నూతనంగా ఏర్పాటు చేసిన మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, జలమండలి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరు అందించడమే ద్యేయమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో పనులు మంజూరవడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 30 సంవత్సరాలుగా నెలకొన్న సమస్య నేటి తో తీరనుందని, కాలనీ వాసుల కోరిక మేరకు పాత మంచి నీటి పైప్ లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ వేయనున్నట్లు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.
ఎంఐజీ కాలనీ లో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఎమ్మెల్యే సీడీపీ నిధుల ద్వారా మంజూరైన రూ. 5 లక్షల ప్రొసీడింగ్ ఆర్డర్ కాఫీని చందానగర్ సీఐ క్యాస్ట్రో రెడ్డి అందజేశారు. ఈ నిధులతో కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం రాజశేఖర్, మేనేజర్ సుబ్రహ్మణ్యం, జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, సీఐ క్యాస్ట్రో రెడ్డి, ఎస్ఐ వెంకటేష్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి భారతి నగర్ డివిజన్ అధ్యక్షుడు బున్, ఎంఐజీ అధ్యక్షుడు భాస్కర్, సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు జ్యోతి, నాగమణి, సొసైటీ అధ్యక్షుడు బాలయ్య, డైరెక్టర్లు ఎంఎల్ఎన్ రెడ్డి, కరుణాకర్, సుబ్బా రావు, సునీల్, బాక్సర్ గిరి, సంపత్ గౌడ్, రాకేష్, వెంకట్, సురేందర్,వెంకటేశ్వర్లు, అనిత, సంధ్య, శ్రీలత, స్వర్ణ లత, బేబీ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.