నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థి దశలోనే క్రమశిక్షణ అలవరుచుకోవాలని, విద్యార్థులు కష్టపడి చదివి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని యూనివర్సిటీ ఆప్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ ఆప్ హైదరాబాద్ వైస్ చాన్స్ లర్, చైర్మన్ బిజె రావు సూచించారు. యూనివర్సిటీ ఆప్ హైదరాబాద్ పాఠశాలలో ఏడవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వీసీ బిజె రావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.