నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద ప్రజలు ఆర్థిక స్వావలంబన పొందుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కి చెందిన కె.అది లక్ష్మి అనే వ్యక్తి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 90 వేల ఎల్ ఓ సీ పత్రాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, టీఆర్ఎస్ నాయకులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.