ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది – నానక్ రాం గూడలో గూగుల్ సంస్థ క్యాంపస్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: ఐటీ రంగంలో గూగుల్ సంస్థ దూసుకుపోతుందని, ఐటీ దిగ్గజ కంపెనీ హైదరాబాద్ లో స్థాపించుకోవడం సంతోషకరమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయం తర్వాత టెక్ దిగ్గజం గూగుల్ 3.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్ లో నిర్మించ తలపెట్టిన రెండవ అతిపెద్ద క్యాంపస్ ను గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగుడా లో నూతనంగా నిర్మించ తలపెట్టిన గూగుల్ సంస్థ కార్యాలయం నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, గూగుల్ సంస్థ ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.

గూగుల్ సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఐటీ లో దిగ్గజ సంస్థ అయిన గూగుల్ కంపెనీ అమెరికా తర్వాత హైదరాబాద్ లోని మన ప్రాంతంలో ఏర్పాటు కావడం సంతోషకరమని అన్నారు. ఐటీ లో ప్రపంచం మొత్తము మన వైపే చూస్తుందని, హైదరాబాద్ ఐటీ లో మేటి రంగంగా విరజిల్లుతుందని అన్నారు.

నానక్ రాం గూడలో ఏర్పాటు చేయనున్న గూగుల్ సంస్థ నిర్మాణం పనుల శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే 

ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కార్యాలయాన్ని గచ్చిబౌలిలో ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటుతో మన ప్రాంత వాసులకు, యువతకు సాఫ్ట్ వేర్ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, నాయకులు ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గూగుల్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here