పీజేఆర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపు – ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: క్రీడలు పిల్లల్లోని శారీరక దారుఢ్యాన్ని పెంచడంతో పాటు మానసిక ఉల్లాసం, ప్రశాంతతను కలిగిస్తాయని, సమ్మర్ కోచింగ్ క్యాంప్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగపర్చుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్, కూకట్‌పల్లి జోన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2022 ను స్పోర్ట్స్ డైరెక్టర్ ఎస్ ఎం బాషా, జాయింట్ కమిషనర్ స్పోర్ట్స్ తిప్పర్తి యాదయ్య, చందానగర్ డీసీ సుధాంష్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, పుష్పనాగేష్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ప్రారంభించారు.

సమ్మర్ క్యాంపును ప్రారంభించిన అనంతరం గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, ఉపకమిషనర్ సుధాంశు నందగిరి తదితరులు

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ పీజేఆర్ స్టేడియంలో జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపు ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. ఏప్రిల్ 25 నుండి మే 31 వరకు జరిగే ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వారికి నచ్చిన రంగాలలో రాణింపజేసి పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యతను గుర్తించి ఆ దిశగా అడుగులు వెయిస్తే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. పీజేఆర్ స్టేడియంలో ఎమ్మెల్యే సీడీపీ నిధులతో స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. ఎండ తీవ్రత ను దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు.

సమ్మర్ క్యాంపులో కూచిపూడి నృత్యప్రదర్శనలతో ఆకట్టుకున్న సంస్కృతి ఆర్ట్ అకాడమీ చిన్నారులు

సమ్మర్ క్యాంపు శిక్షణలో భాగంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనతో శాన్వీ, సాత్విక, మోక్ష ఆహుతులను అలరింపజేశారు. సంస్కృతి ఆర్ట్ అకాడమీ గురువులు తరిగొప్పుల శ్వేత, శ్రీధర్ తో పాటు నృత్యప్రదర్శన చేసిన చిన్నారులను ప్రభుత్వ విప్ గాంధీ అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్, స్టేడియం ఇన్చార్జి వీరానంద్, సీఐ క్యాస్ట్రో, ఎస్ఐలు వెంకటేశ్, శ్రీధర్, మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, నాయకులు అక్బర్ ఖాన్, రాజశేఖర్ రెడ్డి, అమిత్, మన్విత, తదితరులు పాల్గొన్నారు.

పీజేఆర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపును ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
సాంస్కృతిక ప్రదర్శనిలిచ్చిన కళాకారులను అభినందిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here